Anantapur: కళ్యాణదుర్గం జున్జప్ప ఆలయంలో 4 కేజీల వెండి ఆభరణాలు మాయం!
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు జున్జప్ప ఆలయంలో భారీ చోరీ. నాలుగు కేజీల వెండి ఆభరణాలు అపహరణ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Anantapur: కళ్యాణదుర్గం జున్జప్ప ఆలయంలో 4 కేజీల వెండి ఆభరణాలు మాయం!
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో జున్జప్ప దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు.. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను అపహరించినట్లు తెలుస్తోంది.
ఆలయ నిర్వాహకుల సమాచారం ప్రకారం నాలుగు కేజీలకు పైగా వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు, గ్రామస్తులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదే ఆలయంలో గతంలోనూ పలుమార్లు చోరీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస చోరీ ఘటనలతో భక్తులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులపై నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాజా ఘటనతో పాటు గతంలో జరిగిన చోరీలపైనా సమగ్ర విచారణ చేపట్టి నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జున్జప్ప ఆలయానికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి, భక్తులు సమర్పించే కానుకలకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.




