Kadiri: ఘనంగా టెట్ శిక్షణా తరగతుల ముగింపు సభ.. సవరణ కోరిన UTF!
Kadiri: NGO హోమ్‌లో UTF ఉచిత టెట్ శిక్షణ ముగింపు సభ ఘనంగా జరిగింది. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరించాలని UTF రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు.
Kadiri: ఘనంగా టెట్ శిక్షణా తరగతుల ముగింపు సభ.. సవరణ కోరిన UTF!
ఘనంగా టెట్ శిక్షణా తరగతుల ముగింపు సభ- విద్యా హక్కు చట్టం 23(1)ను సవరించాలి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్
సత్యసాయి జిల్లా కదిరి N G O హోమ్ నందు జిల్లా కార్యదర్శి మల్లికార్జున అధ్యక్షతన టెట్ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ K S S ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయ చంద్రారెడ్డి, లక్ష్మీ రాజా, జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, రాష్ట్ర కౌన్సిలర్ తాహెర్ వలి, జిల్లా కార్యదర్శులు అమరనారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వేంకటాచలం, రవివర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా k s s ప్రసాద్ మాట్లాడుతూ యూటీఎఫ్ కదిరి డివిజన్ అధ్యర్యంలో గత 33 రోజులుగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సెలవు రోజులలో కూడా నిర్వహించడం గొప్ప విషయం. ఈ శిక్షణ తరగతులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించారని, ఉపాధ్యాయుల ఎటువంటి పరీక్షలైన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.ప్రభుత్వానికి టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తునే మరో ప్రక్క ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ప్రభుత్వం విద్యాహక్కు చట్టం సెక్షన్ 23 (1) సవరించాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ ప్రభుత్వం స్పందించకుంటే మరో సారి రణభేరి లాంటి పెద్ద ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
అనంతరం బోధకులు నాగరాజు, రవీంద్రనాథ్,ఓబులపతి,భాస్కర్, రమేష్, వెంకటరమణ, శంకరనారాయణ రెడ్డి, మహేంద్ర రెడ్డి, మహేష్ రెడ్డి, చాంద్ బాషా లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సునీల్, మధుసూదన్, ఆజమ్ బాషా, సంతోష్, పది మండలాల యూటీఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




