Anantapur: అనంతపురంలో దొంగనోట్ల ముద్రణ ముఠా గుట్టురట్టు ఇద్దరు అరెస్ట్

Anantapur: అనంతపురం శారద నగర్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్న ఇద్దరిని పట్టుకున్న విజయవాడ పోలీసులు. ముద్రణ యంత్రాలు, నకిలీ కరెన్సీ, ల్యాప్‌టాప్ స్వాధీనం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 3 July 2026 8:58 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో దొంగనోట్ల ముద్రణ ముఠా గుట్టురట్టు ఇద్దరు అరెస్ట్

అనంతపూర్: అనంతపురం నగరంలో దొంగ నోట్ల తయారీ వ్యవహారం కలకలం రేపింది. నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద నగర్‌లో ఓ ఇంటిలో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులు రాత్రి సుమారు 10 గంటల సమయంలో దొంగ నోట్ల ముద్రణలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, వీరితో పాటు విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పక్కా సమాచారంతో అనంతపురానికి చేరుకున్న విజయవాడ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, అలాగే ముద్రించిన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story