Kadiri: కదిరిలో ఘనంగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’.. కాంగ్రెస్ దిశానిర్దేశం

Kadiri: కదిరిలో డీసీసీ చీఫ్ KS షానవాజ్ ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించగా ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 Oct 2026 2:29 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో ఘనంగా ‘ఓట్ బచావో – దేశ్ బచావో’.. కాంగ్రెస్ దిశానిర్దేశం

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు KS షానవాజ్ ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజవత్, ఏపీసీసీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజవత్ మాట్లాడుతూ, దేశంలో చాలా కాలంగా జరుగుతున్న ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ గతంలోనే ప్రజలను అప్రమత్తం చేశారని, ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమ సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల సందర్భంగా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ అంశంపై మౌనం వహించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును, రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఓట్ల చోరీపై ప్రజలకు వాస్తవాలను వివరించి, ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2029లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్,పట్టణ అధ్యక్షులు అల్లాబకష్, ZPTC ఆద్యార్థులు బాబు, రామి రెడ్డి, సురేంద్ర నాయక్, శ్రీనివాసులు, నాగేంద్ర, డీసీసీ ఉపాధ్యక్షులు నాగభూషణ , జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాషా ఎంపీటీసీ అభ్యర్థులు ప్రసాద్ నాయి, సురేష్ డీసీసీ కార్యదర్శ్ సుజాత్ ఖాన్, మరియు అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI