Pamidi: సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల డిమాండ్!
Pamidi: పామిడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ఒంటి కాలిపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలని వినూత్న నిరసన చేపట్టారు.
Pamidi: సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల డిమాండ్!
Pamidi: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో బుధవారం పామిడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. వీఆర్ఏలు ఒంటి కాలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని సెటిల్మెంట్ వీఆర్వోలుగా నియమించాలని కోరారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు 70 శాతం ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే విధి నిర్వహణలో మరణించిన వీఆర్ఏల కుటుంబాల్లో వయసుతో సంబంధం లేకుండా ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని సంఘం నాయకులు కోరారు.




