Dharmavaram: ధర్మవరం కోటలో డ్రైనేజీ సమస్యపై స్పందించిన కౌన్సిలర్ సమీర్!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోటలో పేరుకుపోయిన డ్రైనేజీ చెత్తను వార్డు కౌన్సిలర్ సమీర్ శానిటేషన్ సిబ్బందితో తొలగించి శుభ్రం చేయించారు.
Dharmavaram: ధర్మవరం కోటలో డ్రైనేజీ సమస్యపై స్పందించిన కౌన్సిలర్ సమీర్!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం లోనికోటలో డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగునీరు ముందుకు కదలకుండా దుర్వాసన వెదజల్లుతోంది. కాలనీవాసులు వార్డు కౌన్సిలర్ సమీర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు.
స్పందించిన కౌన్సిలర్ సమీర్ శానిటేషన్ వర్కర్లను పిలిపించి డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగింప చేసి పరిసరాల్లో దోమలు దుర్వాసన వెదజల్లకుండా శానిటేషన్ చేయించారు. ప్రజలు మురికి కాలువల్లో చెత్త వేయకుండా చెత్త సేకరించే వాహనాల్లో వేయాలని సమీర్ సూచించారు.




