Rayadurgam: 4 రోజులుగా నీరందక తిప్పలు.. లీకేజీపై స్థానికుల ఆగ్రహం!

Rayadurgam: రాయదుర్గం శాంతినగర్‌లో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు. పైపులైన్ లీకేజీని మరమ్మతు చేయాలని డిమాండ్.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 24 Aug 2026 11:31 AM IST
Rayadurgam
X

Rayadurgam: 4 రోజులుగా నీరందక తిప్పలు.. లీకేజీపై స్థానికుల ఆగ్రహం!

Rayadurgam: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వైఎస్ఆర్ విగ్రహం ఎదురుగా త్రాగునీటి పైపులైన్ లీకేజీ తీవ్ర సమస్యగా మారింది. గత నాలుగు రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతున్నా, మరోవైపు ప్రజల ఇళ్లకు మాత్రం త్రాగునీరు అందకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

నాలుగు రోజులుగా సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని వెంటనే మరమ్మతు చేసి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story