Guntakal: HNSS కాలువ నీటిని పరిశీలించిన మున్సిపల్ అధికారులు!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు హంద్రీనీవా (HNSS) కాలువకు నీరు విడుదలైంది. కాలువ వద్ద నీటి ప్రవాహాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి పరిశీలించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 10 Aug 2026 10:44 PM IST
Guntakal
X

Guntakal: HNSS కాలువ నీటిని పరిశీలించిన మున్సిపల్ అధికారులు!

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం పురపాలక సంఘం HNSS హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు ఈరోజు నీరు విడుదల అయ్యింది.

HNSS కాలువకు నీరు రావడంతో మున్సిపల్ అధికారులు నీటి ప్రవాహాన్ని, నాణ్యతను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియజ్, డి.ఇ రవి ప్రకాష్ నాయుడు, ఏ.ఈ హరికృష్ణ తదితరులు కాలువ వద్దకు వెళ్లి నీటిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీ దేవి మాట్లాడుతూ, HNSS నీరు రావడంతో పట్టణంలో తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. వృథా కాకుండా నీటిని జాగ్రత్తగా వినియోగించాలని పట్టణ ప్రజలకు సూచించారు. కాలువ నుండి ట్యాంకులకు సక్రమంగా నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story