Anantapur: వెల్డింగ్ దుకాణాల్లో ఆగని దొంగతనాలు.. ఎస్పీని ఆశ్రయించిన వ్యాపారులు

Anantapur: అనంతపురంలో వరుస దొంగతనాలతో వెల్డింగ్ వ్యాపారుల ఆవేదన. గత ఆరు నెలల్లో రూ. 40 లక్షల విలువైన కాపర్ వైర్లు చోరీ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 15 Jun 2026 12:41 PM IST
Anantapur
X

Anantapur: వెల్డింగ్ దుకాణాల్లో ఆగని దొంగతనాలు.. ఎస్పీని ఆశ్రయించిన వ్యాపారులు

అనంతపురం: నగరంలో మరియు పరిసర ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న కాపర్ తీగల దొంగతనాలు వెల్డింగ్ వ్యాపారస్తుల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన దాదాపు 50 మంది వెల్డింగ్ దుకాణాల నిర్వాహకులు ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో జిల్లా ఎస్పీని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు.

ఆరు నెలల్లో రూ. 40 లక్షల నష్టం.వ్యాపారస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం పట్టణంతో పాటు, బుక్కరాయసముద్రం, రాప్తాడు పరిసర ప్రాంతాలలో రాత్రి సమయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వెల్డింగ్ దుకాణాల్లోకి చొరబడి విలువైన కాపర్ వైర్లను దొంగిలిస్తున్నారు.

నెలకు కేవలం రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు సంపాదించుకునే తాము, ఈ దొంగతనాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని వ్యాపారులు వాపోయారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న ఈ దొంగతనాల వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న వెల్డింగ్ దుకాణాల నిర్వాహకులు దాదాపు రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.సీసీ ఫుటేజ్ ఇచ్చినా స్పందించని పోలీసులు

దొంగతనాలు జరుగుతున్న తీరుపై నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.దొంగను స్పష్టంగా గుర్తించగలిగే సీసీటీవీ (CCTV) ఫుటేజీలను సైతం పోలీసులకు అందించాం. అయినా సరే స్థానిక పోలీసులు కనీసం స్పందించడం లేదు, దొంగను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

బాధిత వెల్డింగ్ దుకాణ నిర్వాహకులు స్థానిక పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యాపారస్తులు, ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగను త్వరగా పట్టుకోవాలని, నష్టపోయిన తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story