Gooty: జర్నలిస్టుల ధర్నా: నివాస స్థలాల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్!

Gooty: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నివాస స్థలాలు, అక్రిడేషన్ మరియు హెల్త్ కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 5 Aug 2026 5:26 PM IST
Gooty
X

Gooty: జర్నలిస్టుల ధర్నా: నివాస స్థలాల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్!

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ ధర్నాకు యూనియన్ నాయకులు మస్తాన్, గోవిందు, తన్నీరు నాయకత్వం వహించారు. వారు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా నివాస నివాస స్థలాల పట్టాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు ఇంకా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు.

ధర్నా అనంతరం యూనియన్ నాయకులు మండల రెవిన్యూ అధికారి ఆనందబాబుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణానికి చెందిన వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story