Pamidi: పాల్యం తండాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం పాల్యం తండాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 9 Aug 2026 9:31 PM IST
Pamidi
X

Pamidi: పాల్యం తండాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!

పామిడి: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం, పామిడి మండలం పాల్యం తండా గ్రామంలో ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప హాజరయ్యారు. ఆయనతో పాటు పామిడి సీఐ శివశంకర్ నాయక్ . రమేష్ నాయక్ ,టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి రామాంజనేయులు నాయక్*, అనంతపురం పార్లమెంట్ కార్యదర్శి రాజేష్ నాయక్, పామిడి మండల బిజెపి అధ్యక్షులు ఆంజనేయులు నాయక్ మరియు తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను సభికులకు వివరించారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరికీ అందించాలని, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలలో గిరిజనులు ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పామిడి సీఐ శివశంకర్ నాయక్ , గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story