Alamuru: ఆలమూరు లేఅవుట్‌లో భారీ చోరీ వైసీపీ నేత అరెస్ట్!
Alamuru: ఆలమూరు ఇళ్ల లేఅవుట్‌లో మోటార్లు, కేబుల్ వైర్లు దొంగిలించిన వైసీపీ నేత అంకె నరేంద్రను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.50 లక్షల సొత్తు స్వాధీనం.
Alamuru: ఆలమూరు లేఅవుట్‌లో భారీ చోరీ వైసీపీ నేత అరెస్ట్!
Alamuru: రూరల్ మండలంలోని ఆలమూరు లేఅవుట్లో చోరీకి పాల్పడిన మోటార్ల దొంగను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.3.50 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రూరల్ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఆలమూరు గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ లేఅవుట్లో సుమారు 5,500 ఇళ్లు నిర్మిం చడానికి లేఅవుట్ వేశారు.
అక్కడ ఇళ్ల నిర్మా ణంలో నీటి వాడకం కోసం 18 బోర్లు వేశారు. అందులో 11 బోర్లు, పంపులు, కేబుల్, బోర్డులు ఏర్పాటుచేశారు. ఆలమూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత అంకె నరేంద్ర లేఅవుట్లోని రెండు పంపింగ్ మోటార్లు, వైర్లు, ఇతర సామగ్రిని దొంగలించాడు. సుమారు రూ.3.50 లక్షల విలువైన సొత్తు చోరీపై మే 16న కేసు నమోదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నరేంద్రను అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.




