Kadiri: కదిరి తహశీల్దార్‌కు బాధితుల ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువు పంచాయతీలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Kadiri: కదిరి తహశీల్దార్‌కు బాధితుల ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు
కదిరి: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువు పంచాయతీలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కలకలం రేపింది. గత వైసిపి ప్రభుత్వంలో పేదల కోసం భూ పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలు బరితెగించి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి లబ్ధిదారులకు అందజేశారు. ముత్యాల చెరువు పంచాయతీలోని నల్లగుట్ట తండా, చిగురుమాని తండాలో పదిమంది లబ్ధిదారుల దగ్గర లక్షల రూపాయలు తీసుకొని నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు అయితే బ్యాంకులో రుణం కోసం వెళ్ళిన రైతులు డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలుగా గుర్తించారు.
మోసపోయమని గ్రహించిన రైతులు కదిరి తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. పాస్ పుస్తకాలను పరిశీలించిన తహసిల్దార్ ఫేక్ గా గుర్తించారు. అయితే తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కాగా ముత్యాల చెరువు పంచాయతీకి చెందిన వైసిపి కీలక నేత నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత వైసిపి ప్రభుత్వంలో భూ పంపిణీలో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు ఈ నేత పాల్పడినట్లు తెలుస్తున్నది. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తే మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు బయటపడే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తున్నది.




