Guntakal: మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఓటర్ లిస్ట్ సవరణపై చర్చ!
Guntakal: మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి నివాసంలో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. గుత్తి పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై చర్చించారు.
Guntakal: మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఓటర్ లిస్ట్ సవరణపై చర్చ!
గుంతకల్: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి నివాసంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు వై. నైరూతి రెడ్డి, నియోజకవర్గ యువ నాయకుడు సీబీ. మంజునాథ్ రెడ్డి గుత్తి పట్టణ వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గుత్తి పట్టణంలోని వార్డులలో జరుగుతున్న SIR - Special Intensive Revision కార్యక్రమం గురించి చర్చించారు. ఓటరు జాబితా సవరణలో ఎవరూ మిగిలిపోకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వరదరాజులు, గుత్తి మున్సిపాలిటీ 7వ వార్డు అధ్యక్షులు పోగుల అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
Next Story




