Kadiri: కదిరిలో వైభవంగా 'యోగాంధ్ర'.. జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఆసనాలు వేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో "యోగాంధ్ర" కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 10 Jun 2026 11:14 AM IST
Kadiri
X

Kadiri: కదిరిలో వైభవంగా 'యోగాంధ్ర'.. జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఆసనాలు వేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని యోగాసనాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భావితరాలు ఆరోగ్యవంతంగా, ఆనందంగా జీవించాలంటే యోగను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగ కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువత పబ్బులు, అనారోగ్యకర అలవాట్ల వైపు వెళ్లకుండా యోగ వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పెంపొందించడమే యోగాంధ్ర కార్యక్రమాల ప్రధాన లక్ష్యమన్నారు.

జూన్ 18న తిమ్మమ్మ మర్రిమానులో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే, కటారుపల్లిలో కూడా ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణం సమీపంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆరోగ్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story