Lepakshi: లేపాక్షిలో యోగా సందడి.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మంత్రి సవితమ్మ!
Lepakshi: లేపాక్షిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్న మంత్రి సవితమ్మ.
Lepakshi: లేపాక్షిలో యోగా సందడి.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మంత్రి సవితమ్మ!
లేపాక్షి : ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఉత్తమ మార్గమని యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని మంత్రి సవితమ్మ తెలిపారు. ఆదివారం ఉదయం లేపాక్షి మండలంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖల మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ చారిత్రాత్మక లేపాక్షి క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మహిళలు, యువత, వృద్ధులు అందరూ ఈ యోగా శిబిరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు.
యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని తెలిపారు ., యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి మార్గమని అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు మరియు అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు సానుకూల ఆలోచనా విధానం పెంపొందుతాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భారతదేశపు ప్రాచీన ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన సాధనమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగాను ఆచరించాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, "ఒక భూమి - ఒక ఆరోగ్యం కోసం యోగా" అనే లక్ష్య సాధనకు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సవితమ్మ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ జాయింట్ కలెక్టర్ భరద్వాజ్, సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ డిఎఫ్‌ఓ చక్రపాని,డిఆర్‌డిఎ పిడి నరసయ్య,జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆయుష్ ప్రతినిధులు, యోగా మాస్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




