Anantapur: చారిత్రాత్మక గుత్తి కోటలో యోగాసనాలు.. ఘనంగా 'యోగాంధ్ర' వేడుక!
Anantapur: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుత్తి కోటలో 'యోగాంధ్ర' కార్యక్రమం ఘనంగా జరిగింది.
Anantapur: చారిత్రాత్మక గుత్తి కోటలో యోగాసనాలు.. ఘనంగా 'యోగాంధ్ర' వేడుక!
అనంతపురం జిల్లా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుత్తి చారిత్రాత్మక కోట ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ గారు పాల్గొని యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ గారు మాట్లాడుతూ, యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని అన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవితంలో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
గుత్తి కోట వంటి చారిత్రాత్మక ప్రదేశంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం ద్వారా యోగా ప్రాముఖ్యతను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ ఆర్బిఎస్కె శ్రీనివాస్, మెప్మా పిడి విశ్వజ్యోతి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియ, గుత్తి తహసీల్దార్ పుణ్యవతి, ఆయుష్ వైద్యాధికారి డా.తిరుపతి నాయుడు, యోగా మాస్టర్లు తిప్పయ్య, నాగమణి, కళావతి, కృష్ణయ్య, రామకృష్ణ, ఎంఈఓ, ఎంపిడిఓ, గుత్తి కోట పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు విజయభాస్కర్, మెప్మా టెక్నికల్ ఎక్స్పర్ట్ భవాని, ఆయా శాఖల అధికారులు, అనధికారులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




