Penukonda: సోమందేపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి!
Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ ఎఫెక్ట్తో బోయ శ్రీకాంత్ అనే యువకుడు కుప్పకూలి ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
Penukonda: సోమందేపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి!
Penukonda: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ: సోమందేపల్లిలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది గురువారం వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు పలుమార్లు వినాయక మండపాలు దగ్గరకు వెళ్లి వినాయక నిమజ్జనం ఎటువంటి డీజే సౌండ్లు ఏర్పాటు చేయకూడదని ఘర్షణలకు దిగకూడదని శాంతియుతంగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు.
అయితే కొందరు యువకులు డిజె సౌండ్ లో ఏర్పాటు చేసుకొని వినాయక నిమజ్జనం పాల్గొన్నారు. సోమందేపల్లి మారుతి నగర్ కు చెందిన బోయ శ్రీకాంత్ డీజే సౌండ్ ఎఫెక్ట్తో ఒక్కసారిగా కుప్పకూలాడు.
దీంతో వెంటనే పోలీసులు గమనించి పోలీసు వాహనంలో పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. నీతో వాల్మీకి సర్కిల్లో విషాదఛాయ ఘటనలు చోటు చేసుకున్నాయి.




