Pamidi: పామిడిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

Pamidi: పామిడిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి.. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేత నాగూర్ ఈశ్వర్ రెడ్డి.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Updated on: 2 Sept 2026 3:35 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు!

Pamidi: పామిడి దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పామిడి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

పామిడి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, పావలా వడ్డీ వంటి పథకాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

పామిడి టౌన్ కన్వీనర్ నాగూర్ ఈశ్వర్ రెడ్డి, మండల కన్వీనర్ రామకృష్ణ నాయక్, సీనియర్ నాయకుడు ఎద్దులపల్లి రామకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పామిడి సూరి వాల్మీకి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల రామచంద్ర, కొండాపురం భాస్కర్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, టౌన్ బీసీ సెల్ నాగేష్ యాదవ్, ఓబులాపురం ఓబులేసు, టౌన్ ఉపాధ్యక్షులు తుల్లా భాయ్, సల్లుద్దీన్, శివ రాథోడ్, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, నరసింహ, మండల ప్రధాన కార్యదర్శులు సుధాకర్, బాలకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, మైనార్టీ నాయకులు అన్వర్ ఖాన్, రజాక్, సాలెహ, మాజీ కౌన్సిలర్ రాజు, హరి, కటికిందపల్లి వైస్ ఎంపీపీ భర్త నక్క ఓబులేసు, సీనా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శీను, ఉదయ్, వెంకటేష్, జాకీర్, జాన్, మైను, లాల్ బాషా, సుధాకర్ నాయక్, వెంకట్ గుప్తా, లాలప్ప, రమేష్, సాకల సుంకన్న, కొండాపురం రామంజి, దేవరాజ్, ముత్యాల రెడ్డి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story