Tadipatri: తాడిపత్రి ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Tadipatri: తాడిపత్రిలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ భాషా. ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం.
Tadipatri: తాడిపత్రి ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ భాషా ఉదయం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పట్టణంలోని ఆశ్రమంలో దాదాపుగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వలి, రియాజ్, చిట్టి, చవ్వ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




