Gandlapenta: సోమయాజులపల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు

Gandlapenta: గాండ్లపెంట మండలం సోమయాజులపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 17 Oct 2026 9:29 PM IST
Gandlapenta
X

Gandlapenta: సోమయాజులపల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు

సత్య సాయి జిల్లా: గాండ్లపెంట మండలం సోమయాజులపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కదిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

వైసీపీ మాజీ సర్పంచ్, మాజీ రేషన్ డీలర్ శ్రీరాములు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కాంతమ్మతో పాటు సాలెమ్మ, బి. రవి, శ్రీరాములు, నాగన్న, వేములయ్య, అంజినమ్మ, రామంజులు, గిరిబాబు, చింతలప్ప, వై. శ్రీరాములు, వై. లక్ష్మన్న, జె. ఉతన్న, ఆర్. వెంకటరమణ, నాగరత్నమ్మ, వేమన్న, జయరాములు, గంగులమ్మ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో గాండ్లపెంట మండల కన్వీనర్ గొడ్డువెలుగల ప్రసాద్, మాజీ కన్వీనర్ వెంకటరమణ, సింగిల్ విండో అధ్యక్షులు రామంజులు రెడ్డి, మాజీ ఎంపీపీ గంగరాజు, గ్రామ అధ్యక్షులు రమణ రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్ర తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI