Hindupur: హిందూపురంలో ముమ్మరంగా వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి షాజియా ప్రచారం!

Hindupur: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి షాజియా ముమ్మర ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 24 Oct 2026 4:52 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురంలో ముమ్మరంగా వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి షాజియా ప్రచారం!

Hindupur: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ ప్రజలందరూ తనను తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి, ఆశీర్వదించాలని, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపితే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షాజియా అన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి ఆమె విస్తృతంగా పర్యటించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR