Kadiri: ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అక్రమాలు.. టిడిపిపై వైఎస్ఆర్సిపి ఆరోపణలు!
Kadiri: కదిరిలో ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియపై వైఎస్ఆర్సిపి ఆరోపణలు. టిడిపి నేతలు సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని సమన్వయకర్త బి.ఎస్. మక్బుల్ విమర్శ.
Kadiri: ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అక్రమాలు.. టిడిపిపై వైఎస్ఆర్సిపి ఆరోపణలు!
Kadiri: ఎస్ ఐ ఆర్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలంటూ వైఎస్ఆర్సిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రని టిడిపి చేస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
కొంతమంది బిఎల్ఓ లు టిడిపి నేతల ఇళ్లలో కూర్చొని ఎన్నుమురేషన్ అదేవిధంగా మ్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కొన్నిచోట్ల టిడిపి నేతలు ఓ ప్రత్యేక యాప్ రూపొందించి వాటి ద్వారా వైఎస్ఆర్సిపి సానుభూతి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ తమ ఓటును తామే కాపాడుకునే విధంగా ఉండాలని సూచించారు. కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎస్ ఐ ఆర్ ఫై అనుమానాలను నివృత్తి చేసేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఎవరైనా అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే వార్ రూమ్ ను సంప్రదించవచ్చని సమన్వయకర్త బిఎస్ మక్బుల్ తెలిపారు.




