Kadiri: కదిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు జైనుల్లాతో పాటు 70 కుటుంబాలు. కండువా కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 Oct 2026 4:16 PM IST
Kadiri
X

Kadiri: కదిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చేలా భారీ చేరికలు జరిగాయి.కదిరి మున్సిపాలిటీ 27వ వార్డులో సి.ఎం.డి. ఆదిల్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ జైనుల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 70 కుటుంబాలు కూడా పార్టీలో చేరడం జరిగింది.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు అందించిన ఆర్థిక సహాయం పట్ల ఆకర్షితులై, ఆ పాలనను మెచ్చి జైనుల్లా ఆధ్వర్యంలో 70 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం పార్టీతో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

కదిరి మున్సిపాలిటీలో 27 వార్డ్ మొట్టమొదటి అభ్యర్థిగా జైనుల్లా ని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ ప్రకటించారు. ఈ చేరికలతో కదిరి మున్సిపాలిటీలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాష, టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI