Hindupur: ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బెల్ట్ షాపు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన!
Hindupur: కొట్నూరు వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ స్థలంలో నిర్వహిస్తున్న అక్రమ బెల్ట్ షాపుపై వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ వేణు రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
Hindupur: ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బెల్ట్ షాపు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన!
హిందూపూర్: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జ్ దీపిక వేణు రెడ్డి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఎ బెల్ట్ షాప్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
హిందూపురం పట్టణంలోని కొట్నూరు సమీపంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి పిఏ బాలాజీ కి సంబంధించిన స్థలంలో నిర్వహిస్తున్న బెల్టు షాపు వద్ద వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త దీపికా వేణు రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసన తెలిపారు.
స్వయంగా బాలకృష్ణ పిఏ బాలాజీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం షాపును నిర్వహిస్తున్నాడని ఆరోపించారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ బాలకృష్ణ పిఏ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కూడా బాలకృష్ణ దీనిపట్ల స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.హిందూపురంలో బాలకృష్ణ గెలిపించింది, అక్రమంగా మద్యం అమ్ముకోవడానికి, భూ కబ్జా చేయడానికి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
ఈరోజు సాయంత్రం లోపు అక్రమంగా ఉన్న మద్యం షాపులను మూసి వేయించకపోతే వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిక జారీ చేశారు.




