Guntakal: గుంతకల్లులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన

Guntakal: వైవీఆర్ క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టర్, బుక్‌లెట్ ఆవిష్కరించిన నైరుతి రెడ్డి.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 3 Jun 2026 12:41 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు శ్రీ వై. వెంకటరామిరెడ్డి గారి పిలుపుతో నిర్వహిస్తున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైవీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారి చేతుల మీదుగా పోస్టర్ మరియు బుక్‌లెట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండల, పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు, వైఎస్సార్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ మరియు వార్డు అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story