Kadiri: వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి చేరిన T. పెద్దతండా నాయకులు!
Kadiri: సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం T. పెద్దతండాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు.
Kadiri: వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి చేరిన T. పెద్దతండా నాయకులు!
Kadiri: సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం T. పెద్దతండాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంద్రావత్ కృష్ణ నాయక్, వస్త్రం నాయక్, మంగే నాయక్ తదితరులు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరగా, ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




