Anantapur: అనంతపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరు!
Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో YSRCP ప్రచారం వేగం. మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, 33వ డివిజన్ అభ్యర్థి షేక్ దిల్ షాద్ ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Anantapur: అనంతపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరు!
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా 33వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ దిల్ షాద్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతపురంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
అదేవిధంగా వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్‌కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.మరోవైపు పాత ఊరు, బంగారు వీధి తదితర ప్రాంతాల్లోనూ వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో వైసీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.




