Anantapur: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం!
Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లను మద్దతు కోరారు.
Anantapur: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం!
Anantapur: అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పాదచారులను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రచారంలో రమేష్ గౌడ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని రమేష్ గౌడ్ తెలిపారు.
గత రెండున్నరేళ్ల కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని రమేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. నగరంలో శాంతియుత వాతావరణం నెలకొని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించేలా పాలన అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ అనంతపురం నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్న ఆయన.. నగర సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు తనకు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.నగర భవిష్యత్తు, అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. అదేవిధంగా యోగా సమయంలో నేను వచ్చి యోగా చేస్తున్న వారికి ఇబ్బంది చేసి ఉంటే క్షమించాలని రమేష్ గౌడ్ యోగా వారిని కోరారు .




