Pamidi: పామిడిలో వైసీపీ నిరసన చంద్రబాబు 'వెన్నుపోటు' పోస్టర్లు దగ్ధం!

Pamidi: కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ఆర్‌సిపి ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన చేపట్టారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 5 Jun 2026 2:53 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో వైసీపీ నిరసన చంద్రబాబు 'వెన్నుపోటు' పోస్టర్లు దగ్ధం!

పామిడి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంక్షేమ పథకాలను చంద్రగ్రహణం మొదలైందని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి. ఆర్గనైజర్ కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి విమర్శించారు కూటమిపల్నకు రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు వెన్నెపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని పామిడి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిర్వహించారు అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.ఆర్గనైజర్ కార్యదర్శి పార్టీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వైసీపీకి రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ఓటు మీ ప్రభుత్వం రెండేళ్లు హామీలను విస్మరించి ప్రజలకు వెన్నుపోటు గుచ్చారున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని విమర్శించారు రెండేళ్లుగా రాష్ట్రంలో వెన్నెపోటు పాలన కొనసాగుతుందని మండిపడ్డారు యువతకు ఉద్యోగాలు లేవని ఉద్యోగం ఇవ్వకుంటే మూడు వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీని అమలు చేయలేదన్నారు.

అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద రూ 1500 ఇస్తామని చెప్పి వాటిని అందించకుండా వెన్నెపోటు పొడిచారని విమర్శించారు మహిళలకు రైతులకు సున్నా వడ్డీ అందించకుండా వారిని మోసం చేశారని విమర్శించారు రియంబర్స్ మెంట్ బకాయిలు రూ 4 వేలు కోట్లు ఉన్నాయని వాటిని చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు కూటమి పాలనలో చేసింది ఏమీ లేక చెప్పుకునేకి ఏమీ లేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు చేసింది ఏమి లేకపోవడంతో ప్రెస్టేషన్ తో హామీలపై ప్రశ్నిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై గొడ్డలి పార్టీ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కూటమి పాలనలో చెప్పుకునేందుకు ఏదైనా ఉంది అంటే దౌర్జన్యాలు అక్రమాలు భూకబ్జాలు అప్పుల మోత పథకాల కోసం మాత్రమే నని ఎదవ చేశారు కూటమి ప్రభుత్వం ఈఫలమైందన్నారు వైఎస్ఆర్సిపి ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టులను పార్టీ నేతలతో కలిసి ఆయన దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ మురళి నాయక్ తో పాటు పామిడి మండల కన్వీనర్లు పలు వైసీపీ సంఘం నాయకులు వార్డు ఇంచార్జ్ లు పెద్ద ఎత్తున వైసీపీ ముఖ్య నేతలు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story