Anantapur: ఆర్టీసీ ప్రైవేటీకరణపై వైసీపీ సమరం.. కలెక్టరేట్ వద్ద భారీ నిరసన!

Anantapur: అనంతపురంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ భారీ నిరసన.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 Jun 2026 7:55 AM IST
Anantapur
X

Anantapur: ఆర్టీసీ ప్రైవేటీకరణపై వైసీపీ సమరం.. కలెక్టరేట్ వద్ద భారీ నిరసన!

Anantapur: లాభనష్టాల లెక్కలు చూడకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదైతే.. ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరిస్తూ బినామీలకు దోచిపెట్టే ఘనత చంద్రబాబు నాయుడిదేనని వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాలతో నిర్వహించిన ఈ నిరసనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

కార్మికుల పక్షపాతి జగన్ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, 56 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఓబిరెడ్డి గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, 'సూపర్ సిక్స్' తో పాటు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. సామాన్యులకు అండగా ఉండే ఆర్టీసీని ప్రైవేటీకరించి, ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గపు ఆలోచనను విరమించుకోవాలి. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు.వైసీపీ శ్రేణులు

ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story