Anantapur: వైసీపీ దీక్షలను ప్రజలు పట్టించుకోవడం లేదు!

Anantapur: అనంతపురంలో వైసీపీ రిలే దీక్షలను ప్రజలు పట్టించుకోవడం లేదని, మెగా డీఎస్సీపై చర్చకు తాము సిద్ధమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 7 Aug 2026 9:32 AM IST
Anantapur
X

Anantapur: వైసీపీ దీక్షలను ప్రజలు పట్టించుకోవడం లేదు!

Anantapur: అనంతలో వైసిపి రిలే నిరాహార దీక్షలకు స్పందనలేదని ఘాటుగా వ్యాఖ్యానించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు నగర్‌లో 'ఇంటింటికి కూటమి ప్రభుత్వం' కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు నగర్‌లో దాదాపు 35 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన రహదారి నిర్మాణానికి రూ. 1.20 కోట్లతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పనులను ప్రారంభించారు. దశాబ్దాలుగా నరకం చూస్తున్న తమకు రోడ్డు సౌకర్యం కల్పిస్తుండటంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

"వైసీపీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,347 ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది."

"గత ప్రభుత్వంలో జగన్ ఉపాధ్యాయులను బాత్రూమ్‌లు, వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేసి తీవ్రంగా అవమానించారు. కానీ మన మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ వృత్తికి తగిన గౌరవాన్ని ఇస్తున్నారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిన చరిత్ర జగన్‌ది అయితే... చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెరిగి, ప్రపంచ ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న గొప్ప వ్యక్తి మంత్రి నారా లోకేష్."

"మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలని కోరుతున్న వైసీపీ నాయకులను ఒక్కటే అడుగుతున్నా... గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వస్తే ఎందుకు అడ్డుకున్నారు? మెగా డీఎస్సీ అయినా, లిక్కర్ కుంభకోణం అయినా... ఏ అంశంపైనైనా చర్చించేందుకు మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు !"

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story