Puttaparthi: స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీదే విజయం: మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Puttaparthi: పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం.
Puttaparthi: స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీదే విజయం: మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
Puttaparthi: పుట్టపర్తి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం.
సమావేశానికి భారీగా తరలివచ్చిన వైఎస్ ఆర్ సిపి పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, సర్పంచులు,కార్యకర్తలు,నాయకులు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో దిశా నిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.
అనంతరం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకరణ శుద్ధిగా కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసిన మాజీ ఎమ్మెల్యే.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వ కార్డులను పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అందజేశారు.
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపాలిటీలోని 28 వార్డులు,78 సర్పంచులు, 72 ఎంపీటీసీలు,6 జడ్పిటిసి 6 ఎంపిపి లను గెలిచి విజయ దుందుభి మోగిస్తామన్న మాజీ ఎమ్మెల్యే.
పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ రెండున్నర సంవత్సరకాలంలో కూటమి ప్రభుత్వంలో చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి.
పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పల్లె సింధూర,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి జీరో అని శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగలేదన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.
పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అని పేరు చెప్పుకొని గ్యాంబ్లింగ్, మట్కా, గంజాయి, బిల్ట్ షాపులు నడిపిస్తూ ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది.




