అవినీతికి డిజిటల్ బాట.. సబ్ రిజిస్ట్రార్ అక్రమ వసూళ్లపై ఏసీబీ పంజా

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం భారీ సోదాలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 8:22 PM IST
Nandyal
X

అవినీతికి డిజిటల్ బాట.. సబ్ రిజిస్ట్రార్ అక్రమ వసూళ్లపై ఏసీబీ పంజా

నంద్యాల/బ్యూరో: నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం నుండి ఎసిబి అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించి అనధికారికంగా 16 వేల రూపాయల నగదును ఫోన్ పే ల ద్వారా వేలల్లో బదిలీలు జరిగినట్లు వాట్సాప్ చాటింగ్ లో జరిగిన స్క్రీన్ షాట్ లను గుర్తించిన ఎసిబి అధికారులు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల విలువైన ఆస్తుల వివరాలు ఉన్న కార్యాలయంలో అనధికార వ్యక్తులు చక్రం తిప్పుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటూ అధికారులకు అండగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించిన ఏసీబీ డిఎస్పి సోమన్న.

జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న హుస్సేన్ పీరా అనే వ్యక్తి వద్ద ఆదాయ పంపకాల విషయంలో రిజిస్టర్ ను మెయింటైన్ చేశారని వాటిలో ప్రతిరోజు సబ్ రిజిస్టర్ అయిన చంద్రమౌళికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిన విషయాన్ని గుర్తించామన్న ఏసీబీ డీఎస్పీ.

ప్రభుత్వ జీవో కు విరుద్ధంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలో లావాదేవీలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామన్న ఏసీబీ డిఎస్పి. నిన్న ఒక్కరోజే సబ్ రిజిస్టర్ చంద్రమౌళికి ఫోన్ పే ద్వారా 35 వేల రూపాయల డబ్బును పంపినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తప్పుడు రిజిస్టర్ లను మరియు ఇతర వ్యవహారాలను పూర్తిగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఏసీబీ డిఎస్పి సోమన్న.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story