Bhuma Akhila Priya: అతి మంచితనం వల్ల నష్టపోయాం.. ఇకపై మా రాజకీయం వేరు!
Bhuma Akhila Priya: నంద్యాల కోర్టు కాంప్లెక్స్ వద్ద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bhuma Akhila Priya: అతి మంచితనం వల్ల నష్టపోయాం.. ఇకపై మా రాజకీయం వేరు!
Bhuma Akhila Priya: నంద్యాల కోర్ట్ కాంప్లెక్స్ వద్ద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతకుంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 12 మంది దోషులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ. రేపటి నుండి తమ ప్రజలు, ప్రత్యర్థులు, అన్ని పార్టీల నేతలు మరియు మీడియా మిత్రులు తమ రాజకీయాల్లో మార్పులు చూడబోతున్నారని పేర్కొన్నారు. “అతి మంచితనం మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నాం” అని వ్యాఖ్యానించారు.
చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేసిన ఆమె, రాజకీయాల్లో తాము ఎంతో నష్టపోయామని తెలిపారు. తాము కేసులు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.
జీవిత ఖైదు శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేసులో హైకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించి న్యాయ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి బాధితులకు న్యాయం సాధిస్తామని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు.




