Alur: మారిన రూపురేఖలు.. 60 శాతం పూర్తయిన రోడ్ల పనులు

Alur: ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.120 కోట్ల నిధులను కేటాయించిందని నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 9:02 PM IST
Alur
X

Alur: మారిన రూపురేఖలు.. 60 శాతం పూర్తయిన రోడ్ల పనులు

Alur: ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సుమారు రూ.120 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.80 కోట్లను రహదారుల అభివృద్ధికి, రూ.30 కోట్లను పాఠశాలలు మరియు ఇతర మౌలిక వసతుల మరమ్మత్తులకు వినియోగించినట్లు వివరించారు.

జిల్లాలో ముఖ్యంగా ఆలూరు ప్రాంతంలో రోడ్ల పరిస్థితి గతంలో దయనీయంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికే సుమారు 60 శాతం పనులు పూర్తి కావడం సంతోషకరమని తెలిపారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు కొనసాగుతున్నందున, వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరినట్లు చెప్పారు.

అదేవిధంగా వివిధ అభివృద్ధి మరియు మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలో గతంలో తొలగించబడిన పెన్షన్లను పునరుద్ధరించి, అర్హులైన కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలనికోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story