Sarvepalli: సర్వేపల్లిలో అమరావతి విజయోత్సవాలు
Sarvepalli: అమరావతి రాజధానిపై కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్రతో సర్వేపల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
Sarvepalli: సర్వేపల్లిలో అమరావతి విజయోత్సవాలు
Sarvepalli: పొదలకూరులో సంగం రోడ్డు సెంటర్ నుంచి పోలీసు స్టేషన్ వరకు టీడీపీ శ్రేణుల బారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ, శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహాలకు నివాళులు అర్పించారు. అటు మనుబోలులో మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఇటు మనుబోలు, ముత్తుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో భారీ కేక్ కటింగ్ చేసి పండుగ వాతావరణం నెలకొంది.
వెంకటాచలంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.సర్వేపల్లిలో మిఠాయిల పంపిణీ చేశారు. తోటపల్లిగూడూరులోనూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస రావు పర్యవేక్షణలో ప్రత్యేక సంబరాలు మిన్నంటాయి.
నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి కార్యాలయంలోనూ సంబరాలు జరుపుకున్నారు. అల్లీపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు. ఎటు చూసినా జై అమరావతికి జై జై అమరావతి అంటూ ప్రజలు నినాదాలు చేస్తూ సంబరాలు మిన్నంటాయి.
వైసిపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటకు పుల్ స్టాప్ పడిందని కేంద్రం ఆమోదముద్ర వేసిందని ఇది తెలుగు ప్రజల ఆశయమని తెలుగు ప్రజల గెలుపు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎటు చూసినా సంబరాలతో మునిగితలిన సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు ప్రజలు సంబరాలలో మునిగితేలుతున్నారు. అమరావతి ఏర్పడడం కేంద్రం ఆమోదముద్ర వేయడం ఇది ఆంధ్ర ప్రజల కల నెరవేరిందని స్థానిక ప్రజలు అంటున్నారు.




