Srikalahasthi:శృంగేరి పీఠాధిపతిని కలిసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం

Srikalahasthi: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తికి వచ్చిన శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామీజీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 March 2026 6:39 PM IST
Srikalahasthi: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తికి వచ్చిన శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామీజీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
X

Srikalahasthi

Srikalahasthi: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి కి వచ్చిన శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామీజీ తో రాష్ట్ర ప్రభుత్వ తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు....ఈ సందర్భంగా మంత్రి ఆనం పీఠాధిపతి ఆశీస్సులు స్వీకరించారు...రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని స్వామీజీ ఆశీర్వాదాలు అందించాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శృంగేరి పీఠాధిపతిని కలిసినట్లు మంత్రి ఆనం వివరించారు...

ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడడంలో శృంగేరి పీఠం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయాల పరిరక్షణలో శృంగేరి శారదా పీఠం చేస్తున్న సేవలు అపూర్వమని కొనియాడారు...శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చిన శృంగేరి పీఠాధిపతులకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, దేవస్థానం ఈవో బి.కె. వెంకటేశులు, ఆర్డీవో భాను ప్రకాష్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠాధిపతుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గురువులు ఆశీస్సులు అందించడంతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా నిలిచింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story