అమరావతే ఏపీ రాజధాని.. నేడు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం!

AP Reorganisation Amendment Bill: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును నేడు లోక్‌సభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టనున్నారు.

Arun Chilukuri
Updated on: 1 April 2026 10:19 AM IST
AP Reorganisation Amendment Bill
X

అమరావతే ఏపీ రాజధాని.. నేడు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం!

AP Reorganisation Amendment Bill: ఏపీ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఇవాళ లోక్ సభ ముందుకు రానుంది. ఏపీ కేబినెట్ ఆమోదం తర్వాత లోక్ సభలో బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టను న్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈనెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూటమి ప్రభుత్వం ఆమోదించి.. కేంద్రానికి పంపింది.

2024 జూన్ 2 నుంచి అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 సబ్ సెక్షన్ -2లో.. ఏపీ కొత్త రాజధాని అనే పదానికి బదులు.. కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణ చేసింది. అయితే.. లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story