Srikakulam: కురుడు గ్రామ దళితుల గోడు.. ఎస్సీ కమిషన్ సభ్యులకు వినతి!

Srikakulam: కురుడు గ్రామంలో దళిత స్మశాన వాటికకు దారి లేక పడుతున్న ఇబ్బందులపై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన సమతా సైనిక దళ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 12:13 PM IST
Srikakulam
X

Srikakulam: కురుడు గ్రామ దళితుల గోడు.. ఎస్సీ కమిషన్ సభ్యులకు వినతి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో చాలా ఏళ్లుగా పరిష్కారం లేని దళిత స్మశాన వాటిక రహదారి లేక చాలా ఇక్కట్లు పడుతున్నట్లు, తమ గ్రామానికి దళితుల స్మశాన వాటిక రహదారి కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ సమతా సైనిక దళ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చల్లా రామారావు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులైన రావాడ సీతారాం కు తమ బృందంతో కలిసి వినతి పత్రం శ్రీకాకుళం సమావేశంలో అందజేశారు.

కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామం లో సుదీర్ఘకాలంగా పరిష్కారం లేని దళిత సమస్యలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ స్పందించి మారుమూల గ్రామాల్లోని దళిత మౌలిక సౌకర్యాలను కల్పనకు తక్షణమే కార్యాచరణ చేసి క్షేత్రస్థాయిలో అసంపూర్తిగా, పరిష్కారం లేని సమస్యలపై సహృదయముతో స్పందించాలని కోరుతూ, దళిత గ్రామాలు, వీధుల్లోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ సమతా సైనిక దళ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చల్లా రామారావు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులైన రావాడ సీతారాం కు తమ బృందంతో కలిసి వినతి పత్రం, శ్రీకాకుళం సమావేశంలో అందజేశారు.

గ్రామంలో త్రాగునీరు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, మురికి నీరు వెళ్లేందుకు కాలువలు లేక రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం ఈ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలని చల్లా కమిషన్ ప్రతినిధికి విజ్ఞప్తి చేశారు, జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఎస్సీపై వివక్షత ఉందని సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన, చైతన్యం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు,

ముఖ్యమైన మౌలిక సౌకర్యాలైన మంచినీరు, రహదారులు, నిరుద్యోగ యువతీ యువకులకు చేతివృత్తులపై నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కమిషన్ దృష్టికి చల్లా రామారావు తీసుకెళ్లారు, ఆయనతోపాటు కురుమాన సింహాచలం, బొడ్డపాటి కృష్ణారావు, తండ్యాల రమేష్, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story