Udayagiri: ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
Udayagiri: ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో బాబుజి జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. కళాశాల ఇన్ఛార్జ్ సహాయ అధిపతి డా. టి. గోపికృష్ణ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో చిత్రపటానికి పుష్పనివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రెసిడెన్సీలోని షహాబాద్ జిల్లా చందువా గ్రామంలో జన్మించారని తెలిపారు. చిన్ననాటి నుంచే కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి, పాఠశాలలో అమలైన మూడు కుండల విధానాన్ని వ్యతిరేకించి సమానత్వాన్ని సాధించారని చెప్పారు. ఆరా పట్టణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మధ్యంతర విద్యను అభ్యసించి, అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రంలో పట్టా పొందారు.
విద్యార్థి దశలోనే కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు.1935లో నిమ్నకుల సమాఖ్యను స్థాపించి దళితుల హక్కుల కోసం కృషి చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం, భారత్ విడిచిపో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు.1936 నుంచి ససారం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నోసార్.




