Allagadda: ఆళ్లగడ్డలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీటి వసతులు, మెడికల్ క్యాంపులపై అధికారులకు సూచనలు చేశారు.

Ramanjaneyulu, Kurnool
Updated on: 14 March 2026 4:08 PM IST
Allagadda news
X

Allagadda: ఆళ్లగడ్డలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన భూమా అఖిలప్రియ

Allagadda: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె పరిశీలించారు.

పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు, లైటింగ్ తదితర సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అని అధికారులు తో కలిసి తనిఖీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు సమీపంలోని గురుకుల పాఠశాల మరియు వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యతపై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాను పరిశీలించిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని భూమా అఖిలప్రియ తెలిపారు.

Ramanjaneyulu, Kurnool

Ramanjaneyulu, Kurnool

Next Story