Nellore: లాక్ డౌన్ వార్తలు అబద్ధం.. వదంతులు నమ్మొద్దు

Nellore: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో భారత్‌లో ఇంధన పొదుపు అవసరమని బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 2:22 PM IST
Nellore
X

Nellore: లాక్ డౌన్ వార్తలు అబద్ధం.. వదంతులు నమ్మొద్దు

Nellore: పశ్చిమాసియా మధ్య ప్రాచ్య దేశాలైన అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో. భారతదేశంలో ఇంధన పొదుపును పాటించాల్సిన అవసరం ఉందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో , దేశీయంగా ఇందన కొరత లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఇంధన పొదుపు. ఇతర వనరులను పొదుపుగా వాడాలని సూచించారు వాకాటి నారాయణరెడ్డి. ఇవాళ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాకాటి నారాయణరెడ్డి మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు దృష్టి సారించగలిగితే, సాధ్యమైనంత మేరకు ఇంధనాన్ని పొదుపు చేసిన వారమౌతామని, ఆయన కొన్ని ఉదాహరణలతో చెప్పారు. ముఖ్యంగా ఆర్టిసీ, రైల్వే, ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు, కుటుంబ అవసరానికి ఉపయోగించే గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా, వంట సామాగ్రిని వాడాలని. అందులోనూ వృధాను తగ్గించాలని వాకాటి నారాయణరెడ్డి సూచించారు.

ఇటీవల పాశ్చాత్య దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో. ఇప్పటికే అనేకమైన నిల్వలను ప్రధాని మోడీ తీసుకు రాగలిగారని, ప్రస్తుతం ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ. రానున్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఇంధన పొదుపుపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇటీవల ఎదురవుతున్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని మోదీ ఇచ్చిన ఒక సందేశాన్ని, సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్నారని వాకాటి నారాయణరెడ్డి అన్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్న భారతదేశానికి ప్రస్తుతం ఉన్న ఆయిల్ కొరతను అధిగమించడంలో ఇబ్బంది లేదన్న దేశ ప్రధాని మోడీ సందేశాన్ని , లాక్ డౌన్ గా ప్రచారం చేస్తున్నారని వాకాటి అన్నారు. కరోనా లాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న భారతదేశానికి ఇలాంటి పరిస్థితులను అధిగమించడం పెద్ద కష్టం కాదని మోడీ చెప్పారు అన్నారు.

దురదృష్ట శావత్తు కొందరు దీనిని వక్రీకరించి, దేశంలో ప్రధాని లాక్ డౌన్ ప్రకటించబోతున్నారంటూ దుష్ప్రచారం చేయడం శోచనీయని వాకాటి నారాయణరెడ్డి అన్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత క్రూడ్ ఆయిల్ నిల్వల కొరతల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇందన పొదుపు..ఆహారం పొదుపు.. ప్రయాణ ఖర్చులలోను పొదుపులో పాటించాల్సి ఉందని వాకాటి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story