Ramatheertham: రామతీర్థంలో బొత్స కుటుంబం భక్తి తన్మయత్వం.. స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ!

Ramatheertham: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 7:44 PM IST
Ramatheertham
X

Ramatheertham: రామతీర్థంలో బొత్స కుటుంబం భక్తి తన్మయత్వం.. స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ!

Ramatheertham: చైత్ర శుద్ధ నవమి, మంగళప్రదమైన శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, స్వయంవ్యక్త క్షేత్రమైన రామతీర్థ పుణ్యధామం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. ఈ మహోజ్వల ఘడియల్లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, ప్రజానేత బొత్స సత్యనారాయణ మరియు వారి సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యరాలు బొత్స ఝన్సీ లక్ష్మి తన కుటుంబ సమేతంగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శతృఘ్న స్వామివార్లను దర్శించుకుని తరించారు.

రాజోచిత స్వాగతం - వేద ఆశీర్వచనం

రామతీర్థ క్షేత్రానికి విచ్చేసిన బొత్స దంపతులకు, వారి తనయులు, యువజన నాయకులు డాక్టర్ బొత్స సందీప్, డాక్టర్ బొత్స అనూషలకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా, రాజోచితంగా స్వాగతం పలికారు.

పట్టువస్త్ర సమర్పణ - లోకకల్యాణ కాంక్ష

బొత్స సత్యనారాయణ అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి "మంగళప్రదమైన పట్టువస్త్రాలను" సమర్పించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ. "శ్రీరామచంద్రుని కృపాకటాక్ష వీక్షణలు రాష్ట్ర ప్రజలందరిపై ప్రసరించాలని, ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం, సుభిక్షం వెల్లివిరియాలని ఆ జగదభిరాముడిని ప్రార్థించాము.

లోకా సమస్తా సుఖినోభవంతు అనే ఆకాంక్షతో ఈ దివ్య దర్శనం చేసుకున్నామన్నారు,గర్భాలయంలో జరిగిన అభిషేక, అర్చన కార్యక్రమాల్లో బొత్స కుటుంబం తన్మయత్వంతో పాల్గొని పునీతులయ్యారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ముఖ్య నేతలు మరియు అశేష భక్తజనం పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story