Kadiri: ఆంధ్రుల ఆత్మగౌరవం.. మన అమరావతి.. కదిరిలో పండుగ వాతావరణం

Kadiri: పార్లమెంట్ ఉభయసభల్లో నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేయడం పట్ల శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 9:29 PM IST
Kadiri
X

Kadiri: ఆంధ్రుల ఆత్మగౌరవం.. మన అమరావతి.. కదిరిలో పండుగ వాతావరణం

Kadiri: పార్లమెంట్ ఉభయసభల్లో నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేయడం పట్ల కదిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి మహిళా నాయకులు అందమైన రంగవల్లులు (ముగ్గులు) వేసి అమరావతి రాజధాని స్ఫూర్తిని చాటుతూ తమ మద్దతు తెలిపారు.

కోట్లాది మంది ఆంధ్రుల కల సాకారం అయ్యేలా కృషి చేసిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!

రాజధాని కోసం భూములిచ్చి స్వచ్ఛందంగా త్యాగం చేసిన రైతులకు, పార్లమెంట్‌లో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story