Chintakunta: చింతకుంట నలుగురి హత్య కేసులో సంచలన తీర్పు!

Chintakunta: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో 2012లో జరిగిన నలుగురి హత్యల కేసులో 12 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 3:33 PM IST
Chintakunta
X

Chintakunta: చింతకుంట నలుగురి హత్య కేసులో సంచలన తీర్పు!

Chintakunta: నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన చింతకుంట హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో 12 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో జరిగిన నలుగురు హత్యల కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేసి, కృష్ణారెడ్డితో పాటు అతని భార్య గోవిందమ్మ, కొడుకు మలికార్జున రెడ్డి, మామ రామి సుబ్బారెడ్డి ని కత్తులతో దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటనపై ఆళ్లగడ్డ పోలీసులు మొత్తం 19 మంది పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఏడుగురు నిందితులు మృతి చెందగా, మిగిలిన 12 మందిపై సాక్షాలు రుజువయ్యాయి.ఈ కేసులో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అంబన్న రాజు, 12 మంది నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

శిక్ష పడిన నిందితులు: కుందూరు రామిరెడ్డి, ఇంతటి శివ సుమా రెడ్డి, మాయుసాంగారి గుసేనా వలి, కమ్ముబా గారి కమాల్ వలి, కమ్ముజా గారి చిన్న బాబు వలి, మాదిగ పెద్ద అంకాలు, పుట్టసా గారి పల్కర్ వలి, లత్యు మాల శ్రీను, ఉయ్యాలవాడ చాంద్ బాష, కమ్ముబాయి గారి మహబూబ్ బాష, లక్కు శ్రీను, కమ్ముబాయి గారి బాబు బాష.

తీర్పు వెలువడిన వెంటనే నిందితులను తరలించేందుకు పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. నంద్యాల స్పెషల్ జైలులో వసతి లేమి కారణంగా వారిని కర్నూలు జైలుకు తరలించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పదేళ్లకు పైగా సాగిన ఈ కేసులో చివరికి న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ తీర్పు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story