CM Chandrababu: పోలీసులను చూసైనా మారండి... అటవీ అధికారులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

CM Chandrababu: అమరావతిలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 March 2026 1:11 PM IST
CM Chandrababu: పోలీసులను చూసైనా మారండి... అటవీ అధికారులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
X

CM Chandrababu: పోలీసులను చూసైనా మారండి... అటవీ అధికారులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

CM Chandrababu: అమరావతిలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, అధికారులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టంగా సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే పీపుల్స్ ఫ్రెండ్లీగా మారిందని, అయితే అటవీ శాఖ మాత్రం ఇంకా అదే దిశగా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ సహకారం ఎంతో అవసరమని సీఎం చెప్పారు. గ్రీన్ కవర్ పెంపు, బయోడైవర్సిటీ పరిరక్షణతో పాటు ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేలా అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల సూచనలను అటవీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని ఆదేశించారు. కొంతమంది అటవీ అధికారుల ఇంప్రాక్టికల్ ఆలోచనల వల్ల సమస్యలు వస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు.

శ్రీశైలం ప్రాంతంలో భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో తర్వాత రోజు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. బద్వేలులో కూడా ఇదే తరహా సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. హిందూపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలు, యువతలోని వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

యువ అధికారులకు సీనియర్ అధికారులు సహకారం అందించాలని, నాలెడ్జ్ ఎకనామీ పెరిగేలా సేవల రంగాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. జిల్లాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల పెరుగుదలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, తదుపరి సమావేశం నుంచి ఈ అంశాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.అదే విధంగా పులికాట్ సరస్సు, సూర్యలంక, గండికోట వంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ సదుపాయాలు ఏర్పాటు చేస్తే పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. విజయవాడలో డిస్నీల్యాండ్, భవానీ ఐలాండ్ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story