Vinjamur: సీఎం పర్యటనకు వింజమూరు సిద్ధం.. 5-అంచెల భద్రతతో నెల్లూరు పోలీసుల పహారా!

Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 11:21 AM IST
Vinjamur
X

Vinjamur: సీఎం పర్యటనకు వింజమూరు సిద్ధం.. 5-అంచెల భద్రతతో నెల్లూరు పోలీసుల పహారా!

Vinjamur: ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం, వింజమూరు గ్రామంలోని జాగీరు వనంలో జరగబోయే పర్యటనను దృష్టిలో ఉంచుకొని, జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS వింజమూరు టౌన్ లోని , SV కన్వెన్షన్ హాల్‌లో బందోబస్తు విధుల్లో పాల్గొననున్న పోలీసు అధికారులు, మరియు సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లను మ్యాప్ ద్వారా వివరంగా వివరిస్తూ, ప్రతి ఒక్కరి బాధ్యతలను స్పష్టంగా తెలియజేశారు.

జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రాముఖ్యత కలిగినదని, అందుకు అనుగుణంగా ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండి తమ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాలను కేవలం నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపేలా కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని ఆదేశించారు.

వీవీఐపీ కాన్వాయ్ సురక్షిత ప్రయాణం కోసం రూట్ బందోబస్తు, రూఫ్‌టాప్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలని తెలిపారు. అలాగే వీవీఐపీ ప్రయాణించే మార్గంలో వ్యతిరేక దిశలో వాహనాల కదలికలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అదనంగా, కల్వర్ట్ చెకింగ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహకారంతో యాంటీ సబోటేజ్ చెకింగ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP), కూంబింగ్ చర్యలను క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్లలో సమయపాలనతో హాజరై, ఎట్టి పరిస్థితుల్లోనూ విధి స్థలాన్ని వదిలి వెళ్లరాదని హెచ్చరించారు.

ప్రజలు మరియు అతిథులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, భద్రతా చర్యలలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు పూర్తి యూనిఫారం ధరించి, ఐడీ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, సూచించారు.

డ్యూటీ సమయంలో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శించినా, గైర్హాజరు అయినా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్.పి. గారు హెచ్చరించారు. అలాగే సిబ్బంది కోసం భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేసి, మాన్‌ప్యాక్‌పై ప్రతి ఒక్కరూ దృష్టి ఉంచాలని సూచించారు. డీబ్రీఫింగ్ పూర్తయ్యే వరకు అందరూ విధుల్లోనే కొనసాగాలని ఆదేశించారు.

ఈ బ్రీఫింగ్ అనంతరం జిల్లా ఎస్.పి. మరియు SSG అడిషనల్ SP SSV కృష్ణా రావుతో కాన్వయ్ ఇంచార్జి ఆఫీసర్ మరియు సంబంధిత అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ప్రదేశాలను పరిశీలించి, పూర్తి స్థాయి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి.తో పాటు,అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య గ, టౌన్ ఏ.ఎస్.పి. దీక్ష, SSG ఏ.ఎస్.పి. S.S.V. కృష్ణారావు , రూరల్ డి.ఎస్.పి. ఘట్టమనేని శ్రీనివాస్ రావు, ఎస్.బి. డి.ఎస్.పి. శ్రీనివాసరావు, DTC డి.ఎస్.పి. గిరిధర్, WPS డి.ఎస్.పి. యు. సత్యనారాయణ , ఆత్మకూరు డి.ఎస్.పి. వేణు, కావలి డి.ఎస్.పి. శ్రీధర్, ప్రకాశం WPS డి.ఎస్.పి, కలిగిరి సి.ఐ, ఉదయగిరి సి.ఐ. మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story