Kukunoor: రాజకీయాల కోసం నిర్వాసితుల బలి.. పోలవరం సమస్యలపై సిపిఐ ధ్వజం

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ సమావేశం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 1 April 2026 12:50 PM IST
Kukunoor
X

Kukunoor: రాజకీయాల కోసం నిర్వాసితుల బలి.. పోలవరం సమస్యలపై సిపిఐ ధ్వజం

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని లచ్చిపేట గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ మండల కార్యదర్శి కంగాల కల్లయ్య అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కె గౌస్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని రకాలుగా ఆర్ అండ్ ఆర్ నష్ట పరిహారం ఇచ్చామని ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుండి ఈనాటి వరకు మీడియా ద్వారా చేసుకుంటున్న ప్రచారం సరి అయినది కాదని,

ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలపై పాలక వర్గం, ప్రతి పక్షాలు ఒకరిపై ఒకరు నిందారోపణలతో రాజకీయాలు చేసుకుంటున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల రూపాయల నష్టం జరిగిన ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని, ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పాలకులు న్యాయం చేయలేదు. 45.72 కాంటూరులో ఉన్న వందల ఎకరాల భూములకు, నాన్ రెసిడెన్షియల్ పేరుతో అర్హుల జాబితా నుండి తొలగించిన నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు.

2017 తేదీన ప్రకటించి మొన్నటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వనందున 2022 కటీఫ్ తేదీగా ప్రకటించి పరిహారం ఇవ్వాలని, పునరావాస కేంద్రాలలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలని, భూమికి భూమి తీసుకున్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, మండలానికి యూనిట్గా తీసుకొని నిర్వాసితులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, డివిజన,మండల నాయకులు సిరికొండ రామారావు, గడ్డల ముత్యాలరావు, కట్టం వీరస్వామి, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎస్కె మున్ని, పెంకె వీరబాబు, మచ్చ ప్రశాంత్, మచ్చ సుభద్ర, మడివి ఆదయ్య , మడివి దేవయ్య, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story