Srikakulam: ఎన్నికల హామీలు ఏవి? కంచిలి తహశీల్దార్ ఆఫీస్ ముట్టడి!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలిలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన. పేదలకు ఇంటి స్థలాలు, ₹5 లక్షల నిర్మాణ సాయం అందించాలని డిమాండ్.
Srikakulam: ఎన్నికల హామీలు ఏవి? కంచిలి తహశీల్దార్ ఆఫీస్ ముట్టడి!
Srikakulam: భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) పిలుపు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలి. భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలి. బాడుగ ఇంట్లో ఉండే పేదవారికి ఇంటి అద్దె చెల్లించాలి. ఆ కూటమి ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి. భూ మాఫియాను అరికట్టాలి.
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంచిలి తహశీల్దారు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం, సాగు భూములు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని సిపిఐ నేతలు ఎద్దేవా చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలీనా నారాయణ స్వామి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలను మోసం చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు.
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు మంజూరు చేయాలి, ఇల్లు నిర్మించుకున్నవారికి ఇంటికి 5 లక్షల రూపాయల నిర్మాణ ఖర్చు ఇవ్వాలి. అనంతరం సిపిఐ నేతలు నిరుపేదలకు సాగు భూములు అందించాలని, కేరళ తరహా అద్దె ఇంట్లో ఉన్నవారికి ఇల్లు నిర్మాణం అయ్యేవరకు ఇంటి అద్దె ప్రభుత్వమే చెల్లించాల్సిందని, భూ మాఫియాను అరికట్టాలని, అర్హులందరికీ రేషన్ కార్డు, పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సిపిఐ ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు పుక్కల అరెలమ్మ, సిపిఐ నాయకులు లోకనాథం తదితర నాయకులు పాల్గొన్నారు.




